
Glidden: ఈ రోజుల్లో మన జీవితం మొత్తం దాదాపు మొబైల్ యాప్‌ల చుట్టూ తిరుగుతున్నట్టే మారిపోయింది. ఇంట్లో కూర్చొని వాహనం బుక్ చేసుకోవడం, మార్కెట్‌కు వెళ్లకుండానే అవసరమైన సరుకులు తెప్పించుకోవడం, చదువు, ఉద్యోగాలు, ఆరోగ్య సేవలు, పెళ్లి సంబంధాలు ఇలా ప్రతి అవసరానికి ప్రత్యేకంగా యాప్‌లు అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు టెక్నాలజీపై మరింతగా ఆధారపడుతున్నారు. కొత్త స్నేహితులను చేసుకోవడం నుండి ప్రపంచంలోని ఏ వ్యక్తితోనైనా చాట్ చేయడం వరకూ అన్నీ యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఇవేవీ కాకుండా ప్రేమ, డేటింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అనేక యాప్‌లు కూడా యువతలో విపరీతమైన ఆదరణ పొందాయి.
కానీ డేటింగ్ అనే భావన సాధారణంగా యువకులు, యువతులు లేదా ఆ కల్చర్‌ను స్వీకరించగలిగిన వారికి మాత్రమే అనుకూలంగా ఉండే విషయం. అయితే, ఇటీవలి కాలంలో ఈ భావనను పూర్తిగా తారుమారు చేస్తూ, అక్రమసంబంధాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక విచిత్ర యాప్ ఉన్నట్టు చాలా మందికి తెలియదు. అదే గ్లీడెన్ అనే యాప్. ప్రత్యేకంగా వివాహితుల కోసం, రహస్యంగా సంబంధాలు కొనసాగించాలనుకునే వారి కోసం రూపొందించిన ఈ యాప్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో వినియోగించబడుతోంది.
విశేషం ఏమిటంటే.. ఇలాంటి యాప్‌ను పురుషులు కాదు, మహిళలే డెవలప్ చేశారు. ఇలాంటిదే కావాలనుకునే మహిళలే ఎక్కువగా ఉంటారనే భావనతో వారు ఈ యాప్‌ను రూపొందించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యాప్ యూజర్ల సంఖ్య పదిలక్షలు దాటింది. 150 దేశాల్లో గ్లీడెన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ యాప్ వినియోగదారులు కేవలం ఒక ప్రాంతం లేదా ఒక దేశానికి పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని అర్థమవుతోంది.
ఇటీవలి గ్లీడెన్ సర్వే ప్రకారం.. భారతదేశంలో ఈ యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్న నగరాలు బెంగళూరు, ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, హైదరాబాద్, పూణే. ముఖ్యంగా మహిళలే ఈ యాప్‌లో ఎక్కువగా నమోదు అవుతున్నారన్నది సర్వేలో బయటపడిన కీలక విషయం. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది ఉన్నత విద్యావంతులు, మంచి ఉద్యోగాల్లో ఉన్నవారే. డాక్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, ఛార్టెడ్ అకౌంటెంట్లు, కార్పొరేట్ ఉద్యోగులు వంటి రంగాల్లో పనిచేసే వ్యక్తులే ఈ యాప్‌లో ఎక్కువగా ఉన్నారని సర్వే పేర్కొంది.
ALSO READ: Wedding News: జంబలకిడిపంబ సీన్ రిపీట్.. ఎక్కడో తెలుసా?





