
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే గౌతమ్ గంభీర్ పెళ్లి పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. వెంటనే నాకు, నా తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. నేను ఉండే నివాసం వద్ద బాంబు దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉన్న వ్యక్తి బెదిరింపుకు పాల్పడ్డాడు అని గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు జరిగిన విషయాలను చెప్పుకొచ్చాడు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి.. విచారణ చేపట్టడం ప్రారంభించారు. అలాగే గంభీర్ ప్రస్తుతం ఉంటున్న నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గౌతమ్ గంభీర్ కుటుంబానికి అంతటా కూడా అదనపు రక్షణ పోలీసులు కల్పించారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగం ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అని ట్రాకింగ్ పనులు ప్రారంభించారు.
అయితే నిన్న పహల్ గాం లో ఉగ్రదాడి జరిగిన విషయం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా ఇటువంటి తరుణంలోనే గౌతమ్ గా మీరు ఇలాంటి హెచ్చరికలు రావడం అనేది మరింత భయాందోళనకు గురిచేస్తుంది. ఇక ఢిల్లీ పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తులో ఈమెయిల్ అనేది విదేశాల నుంచి మరి ముఖ్యంగా పాకిస్తాన్ లేదా ఇతర దేశాల నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా కూడా దేశంలో ఇటువంటి బెదిరింపులు అనేవి చాలానే వస్తున్నాయి.
ఇంటర్ రిజల్ట్స్!… ఒక్క రోజులోనే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య?