
తెలంగాణలో రోజురోజుకు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. హత్యలు, అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో మరో ఘోరం జరిగింది. యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం పాంగ్ర బోర్గంకు చెందిన అక్కాచెల్లెళ్ళు నిజామాబాద్ వెళ్లేందుకు రోడ్డుపై నిల్చున్నారు. ఆ సమయంలోనే అటుగా వస్తున్న ధనబండ తండాకు చెందిన ఇద్దరు యువకులు.. వాళ్లిద్దరిని చూసి కారు ఆపారు. ఇంటిదగ్గర వదిలేస్తామని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు.
మార్గమధ్యంలో నల్గొండ నరసింహ స్వామి ఆలయం ప్రాంతానికి సమీపంలో తీసుకెళ్లి కారు ఆపారు. మరో ఇద్దరు యువకులను పిలిపించుకొని యువతులపై లైంగిక దాడికి యత్నించారు. అయితే నిందితుల నుంచి అక్క తప్పించుకుంది. తమకు దొరికిన చెల్లెలిపై నలుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో యువతిని ముళ్ళ పొదల్లో గుర్తించారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ రేప్ కు గురైన యువతిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
-
రంగములోకి దిగిన రాట్ హోల్ మైనర్స్… ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత?
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్
-
50 గంటలైనా కనిపించని జాడ.. 8 మంది కార్మికులు టన్నెల్ సమాధే?
-
రోజులు గడుస్తున్నాయ్…ఆశలు సన్నగిల్లుతున్నాయ్…ఆ 8మంది జాడేది..?
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్