క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వస్తున్నారని మూవీ యూనిట్ తెలిపింది. శంకర్ డైరెక్షన్లో హీరో రామ్ చరణ్ నటిస్తున్నటువంటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈనెల 4వ తారీఖున అనగా రేపు సాయంత్రం రాజమండ్రిలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నట్లుగా అనధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు.
టార్గెట్ సీఎం.. గేమ్ ఛేంజర్ ట్రైలర్ అదుర్స్.. పుష్ప రికార్డులు బ్రేకే!
కాగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతుండడం విశేషం. తెలుగు మరియు హిందీ అలాగే తమిళ, కన్నడ, మలయాళం లాంటి ముఖ్య భాషల్లో ఈ గేమ్ చేంజెర్ సినిమా అనేది దేశవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇక ఈ సినిమాకి దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో ఇప్పటికే ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు అయిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ డైరెక్షన్లో సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ప్రమోషన్లు కూడా బాగానే చేస్తున్నారు.
రైతు భరోసా ఎగ్గొట్టేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్!
అయితే తాజాగా జనవరి రెండో తారీఖున ఈ సినిమా ట్రైలర్ విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఇక సినిమా ట్రైలర్ కూడా బాగానే ఉందంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఈనెల 10వ తారీకు న విడుదల అయ్యే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విజయవాడలో రామ్ చరణ్ గేమ్ చేజర్ లోని ఒక ఫోజును 256 అడుగుల ఎత్తు గల బ్యానర్ కట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అది ఏకంగా వరల్డ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులలో ఒకటిగా నిలిచింది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో పదవ తారీకు వరకు వెయిట్ చేయాల్సిందే.
బీజేపోళ్లకన్నాజగనే మేలు కదరా.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం