ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

ప్రైవేట్ బస్సు టీవీల్లో గేమ్ చేంజెర్ సినిమా ప్రదర్శన!..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా గేమ్ చేంజర్. అయితే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే 186 కోట్లు వరకు వసూలు రాబట్టిన కూడా పైరసీ దెబ్బ ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపుగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో దూసుకెళ్తున్న క్రమంలో ఇలా జరగడం పెద్ద ఎదురు దెబ్బ అవచ్చు.

మద్యం తాగుతున్నారా!… క్యాన్సర్ ముప్పు ఎదుర్కోవాల్సిందే?

కానీ ఈ సినిమా విడుదలై దాదాపు రెండు రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ చిత్రాన్ని పైరసీ భూతం వెంటాడుతుంది. తొలిరోజే భారీ హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో రావడంతో అందరూ కూడా ఒకసారిగా షాక్ అయ్యారు. చాలా బాగా కనిపిస్తూ ప్రేక్షకులు అందరూ కూడా సినిమా ధియేటర్ కి వెళ్లకుండా ఆన్లైన్లోనే సినిమాలను ఉచితంగా చూచేస్తున్నారు. అయితే ఇప్పుడు విచిత్రంగా సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళుతున్నటువంటి వారి కోసం కూడా కొన్ని ప్రైవేటు బస్సుల్లో ఈ గేమ్ చేంజర్ సినిమాని ప్రదర్శిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

రిటైర్మెంట్ ప్రకటించనున్న స్టార్ క్రికెటర్!… మరి ఛాంపియన్స్ ట్రోఫీ?

ఇలా భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఒక్కరోజులోనే ఫుల్ క్లారిటీతో ఆన్లైన్లోకి రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా అయితే ఇలాంటి భారీ బడ్జెట్లు నిర్మించేవారు భవిష్యత్తులో భారీ నష్టాలను చవి చూస్తారని అర్థమవుతుందని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. ఇలానే చాలా సినిమాలు భవిష్యత్తు కాలంలో ఆన్లైన్లోనే విడుదలైన మొదటి రోజు వస్తుండడంతో అందరూ కూడా థియేటర్లకు వెళ్లడం మానేసి ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్లో చూసేస్తున్నారు. దీనిపై ఇప్పటికే చిత్ర బృందం ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఈ విధంగా భవిష్యత్తులో జరగకుండా ఏర్పాటు చేసేలా చిత్ర బృందాలు ఏ విధంగా ప్లాన్లు వేస్తారు వేచి చూడాల్సిందే.

పవన్ vs నాయుడు.. కూటమిలో రచ్చ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button