హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో నివాసం ఉండే ఒక యువకుడు మ్యాట్రిమొనీ సైట్ ద్వారా ఏకంగా 50 మంది యువతలను మోసం చేశాడు. ధనవంతుడు నంటూ సరిగా జుట్టు లేకపోయినా విగ్గులు పెట్టుకుని మరీ ఇప్పటివరకు 50 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తిని తాజాగా పోలీసులు పట్టుకున్నారు.
చావు బతుకుల మధ్య ఉన్న శ్రీ తేజ్ ను పరామర్శించిన సుకుమార్?
హైదరాబాదులోని గచ్చిబౌలి కి చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తి ఎలాగైనా రాయల్ గా బతకాలి అనే ఆలోచనతో మ్యాట్రిమోనీ సైట్ ద్వారా భారీగా యువతలను మోసం చేస్తున్నాడు. మ్యాట్రిమొనీ సైట్ లో “కోట్ల ఆస్తి ఉన్న తనకు వధువు కావాలి” అని తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇక అతను నమ్మి చాలా మంది ఇప్పటికే ధనవంతుల అమ్మాయిలు కొన్ని లక్షల కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసుకున్నారు. చివరికి అతను కట్నం కిందకు వచ్చిన డబ్బులను తీసుకెళ్లి రాయల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. సింపుల్గా చెప్పాలంటే ఇది వంశీకృష్ణ యొక్క దందా అని చెప్పాలి. ప్రతిసారి కూడా విగ్గు పెట్టుకొని వేషాలు మారుస్తూ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నాడు.
నన్ను సీఎం చేస్తే వృద్ధులందరికీ ఉచిత వైద్యం: కేజ్రీవాల్
ఇక తాజాగా ఒక లేడీ డాక్టర్ను కూడా ఇలానే పెళ్లి చేసుకొని మోసం చేయగా ఆ డాక్టర్ యొక్క తండ్రి ధైర్యం చేసి మరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇతని బాగోతం మొత్తం కూడా బయటపడింది. ఇప్పటికీ ఇలాంటి పెళ్లిళ్ల కేసుల్లోనే చాలాసార్లు వంశీకృష్ణ జైలుకు కూడా వెళ్లి వచ్చాడట. కానీ అతని బుద్ధి మాత్రం ఇంకా మార్చుకోకుండా ఇలాంటి దంధాలకే పాల్పడుతున్నాడు.