Saturday, March 14, 2026
Homeఅంతర్జాతీయంస‌హ‌జ మ‌ర‌ణంగా అంత్య‌క్రియ‌లు....నాన్న‌ను అమ్మే చంపేసింది... అస‌లు ఏం జ‌రిగింది...?

స‌హ‌జ మ‌ర‌ణంగా అంత్య‌క్రియ‌లు….నాన్న‌ను అమ్మే చంపేసింది… అస‌లు ఏం జ‌రిగింది…?

భద్రాద్రి కొత్తగూడెం, క్రైమ్ మిర్ర‌ర్: దేశంలో ఏదో ఒక చోట వివాహేత‌ర సంబంధాలు భార్య భ‌ర్త‌ల బంధానికి మాయ‌ని మ‌చ్చ‌లా మారుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో చోటు చేసుకుంది. త‌న సంబంధానికి అడ్డుగా వ‌స్తున్నాడ‌ని భ‌ర్త‌ను త‌న ప్రియుడి స‌హాయంతో నిద్రిస్తున్న క్ర‌మంలో దిండుతో క‌ప్పి ఊపిరాడ‌కుండా చేసి స‌హ‌జ మ‌ర‌ణంగా మ‌ర‌ణించిన‌ట్లు నాట‌కమాడింది.

దీంతో కూతురు నాన్న‌ను అమ్మే మ‌రో వ్య‌క్తితో క‌లిసి చంపింద‌నితెలుప‌డంతో చివ‌రికి క‌ట‌క‌టాల పాలైంది. వివ‌రాల్లోకి వెళితే చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో ఎస్డీ.జాఫర్ సెంట్రింగ్ కూలీగా పని చేస్తూన్నాడు. 13 ఏళ్ల క్రితం ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన ఖతిజాను వివాహం చేసుకున్నాడు.

దంపతులు పదేళ్లు తిప్పనపల్లిలో వీరి సంసారం సాఫీగా సాగింది. కాగా గత మూడేళ్లుగా చింతలపూడిలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు హాస్టల్లో ఉండి చదువుతుండగా, ఎనిమిదేళ్ల కూతురు వీళ్ల దగ్గరే వుంటోంది. ఈ క్రమంలో చింతలపూడి వాసి మీరాతో ఖతిజాకు వివాహేతర సంబంధం ఏర్పడడంతో వీరి మధ్య గొడవలు జరిగి, ఆరు నెలల క్రితం దంపతులు తిప్పనపల్లికి వచ్చేసారు.

గ్రామం మారినా ఖతిజా మీరాతో రహస్యంగా మాట్లాడడం గమనించి, గత పది రోజులుగా ఆమెతో జాఫర్ గొడవ పడుతున్నాడు. దీంతో ఎలాగైన భ‌ర్త‌ను ఎలాగైన అడ్డుతొల‌గించుకోవాల‌ని ప్రియుడితో కలిసి నిద్రపోతున్న సమయంలో మొహంపై దిండు పెట్టి హత్య చేసింది ఖతిజాజ. మద్యం సేవించి కిందపడి గాయాలయ్యాయని, తెల్లరేసరికి చనిపోయాడని క‌న్నీరుమున్నీరుగా విల‌పించింది.

న‌మ్మిన బందువులు బంధువులు అంత్యక్రియలు పూర్తి చేసారు. తరువాత కూతురితో మాట్లాడుతుండగా తన తండ్రిని అమ్మ, మరో వ్యక్తి కలిసి చంపేశారని బంధువులకు తెలిపింది.దీంతో కుటుంబ సభ్యులు ఖతిజాను చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. బ‌య‌ట మోజుల‌కు అల‌వాటు ప‌డి క‌ట్టుకున్న భ‌ర్త‌ను హ‌త్య చేసిన నిందితురాలు చివ‌రికి జైలు గోడ‌లు లెక్క‌ప‌ట్టాల్సి వ‌చ్చింది. కుటుంబ స‌భ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments