
నల్లగొండ ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):-
వేసవికాలంలో పోలీస్ కుటుంబ సభ్యుల పిల్లలకు ఆటవిడుపుగా ఉండాలని, ప్రత్యేకంగా చిన్ననాటి నుండి విద్యార్థినీ విద్యార్థులకు వ్యాయామం, ఆటలపై శిక్షణ అందించి, ఉన్నత స్థానాలకు ఎదగాలనే సదుద్దేశ్యంతో ఈ సమ్మర్ క్యాంపును గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు.. ఈ సమ్మర్ క్యాంపులో దాదాపు 100 మంది విద్యార్థులకు నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం నిర్వహించే శిక్షణలో భాగంగా, విద్యార్థులకు యోగా, కరాటే, వాలీబాల్ లాంటి తదితర క్రీడాంశాలలో నైపుణ్యం కలిగిన పిఈటి, యోగా గురువుల చేత ప్రత్యేకంగా శిక్షణను అందించనున్నట్లు తెలిపారు.
ఈ ఆటలు, యోగా వల్ల పిల్లలకు విద్యార్థినీ విద్యార్థులకు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు. ఇప్పటి సమాజంలో పిల్లలు చిన్నతనం నుంచే సెల్ ఫోన్లకు అలవాటు పడి, ఆటలమీద ఆసక్తి చూపడం లేదన్నారు. ఈ సమ్మర్ క్యాంపు ద్వారా పిల్లలకు అన్ని రంగాలలో సరైన శిక్షణ అందించడంతో విద్యార్ది దశలో క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలిపారు.. పోలీస్ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్బంగా ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐలు సూరప్ప నాయుడు, సంతోష్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐ రాజీవ్, అశోక్, పిఈటి నాగరాజు, కరాటే మాస్టర్ వంశీ, యోగ మాస్టర్ కిషన్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చంపేసి మోడీకి చెప్పమన్నారు.. వాళ్లు నిజంగానే చెప్పారు… ఇప్పుడు అనుభవిస్తున్నారు : ఆర్జీవి సెటైర్