
క్రైమ్ మిర్రర్ , మహాదేవ్ పూర్ ప్రతినిథి:-
– ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
– పాల్గొన్న శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీను బాబు
– ప్రజల ప్రయోజనార్థం మరిన్ని సేవలు: శ్రీను బాబు
మాజీ మంథని ఎమ్మెల్యే శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు 26వ వర్ధంతి సందర్భంగా పుష్పగిరి ఆసుపత్రి వారు కాటారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత కంటి పరీక్ష చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని దుద్దిళ్ళ శ్రీనుబాబు, శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు గారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారి 26వ వర్ధంతి సందర్భంగా కాటారం మండలంలో ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని దీనికి సహకరించిన పుష్పగిరి ఆసుపత్రి యాజమాన్యనికి కృతజ్ఞతలు తెలిపారు. కంటి చూపు లోపం ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి కంటి పరీక్ష చేసుకోవాలని. చికిత్స అవసరం ఉన్న ప్రతి ఒకరికి ఉచితంగా వైద్య సేవలు అందించి కంటి అద్దాలు కూడా ఇస్తారని తెలిపారు. మా కుటుంబంపై మీకున్న ప్రేమనురగలకు మేము ఎల్లప్పుడూ సేవకులుగా ఉంటామని భవిష్యత్తులో మరిన్ని పేద ప్రజలకు ఉపయోగపడే సేవ కార్యక్రమాలను మీ ముందుకు తీసుకువస్తామని అలాగే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు స్వదినియోగం చేసుకోవాలి అన్నారు.
దురలవాట్లకు దూరంగా ఉంటే యువత భవిత ఉన్నతం
తక్షణమే HCU విద్యార్థులపై కేసులు ఎత్తివేయండి : బట్టి విక్రమార్క