బెంగళూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరూ కన్న పిల్లలకు విషమిచ్చి ఆ తరువాత తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని భార్య ఇద్దరు కలిసి పిల్లలకు విషమిచ్చి చంపేసి ఆ తరువాత వాళ్ళిద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఒకేసారి కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు కూడా మరణించడంతో వారు బంధువులు మృతదేహాల మధ్య రోధిస్తున్నారు.
నా లైఫ్ లో బిగ్ అచీవ్మెంట్స్ వీళ్లిద్దరూ!.. ఉప్పొంగిన చిరంజీవి?
ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతులను అనూప్ కుమార్(38), రాఖి(35), అనుప్రియ(5), ప్రియాంష్ (2) గా గుర్తించారు. కాగా వీరి స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ ప్రాంతమని పోలీసులు తెలియజేశారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతోనే సూసైడ్ చేసుకున్నట్లుగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో విశాల్!.. ఎందుకలా?
ఏది ఏమైనా సరే ఈమధ్య ఆర్థిక సమస్యలతోనూ లేదా ఆరోగ్య సమస్యలతోనూ ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో మరీ ఘోరంగా పాపం, పుణ్యం తెలియని పసిపిల్లలను కూడా వారితో పాటుగా చంపేస్తున్నారు. దయచేసి ఇలా ఎవరు చేయకండి అని పోలీసులు ఎంతగా వేడుకుంటున్నా ఫలితం దక్కట్లేదు. కాగా ఇవాళ జరిగిన సంఘటనతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్ జారీ, కొత్త పేర్లు ప్రతిపాదన
ఇప్పటికే బెంగళూరు వ్యాప్తంగా చాలా ఆత్మహత్యలు అనేవి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. పని ఒత్తిడి కారణంగానో ఇక ఆర్థిక సమస్యలు కారణంగానూ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ వారితోపాటుగా అన్యం పుణ్యం తెలియని వాళ్ల బిడ్డలను కూడా పాటుగానే చంపేస్తున్నారు. కాబట్టి చాలామంది కూడా మీరు చావడమే కాకుండా పిల్లల్ని కూడా చంపుతారా అంటూ అది చాలా పాపం అని కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
భారత్‌లో తొలి HMPV కేసు..?.. 8 నెలల చిన్నారికి సోకినట్లు నిర్ధారణ!!