
హైదరాబాద్ హబ్సిగూడలో తీవ్ర విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలను చంపి.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు దంపతులు. మృతులు చంద్రశేఖర్ రెడ్డి, భార్య కవిత, కూతురు శ్రీత రెడ్డి(9వ తరగతి), కుమారుడు విశ్వన్ రెడ్డి(5వ తరగతి)గా గుర్తించారు. గతంలో నారాయణ కాలేజీలో లెక్చరర్ గా పని చేసిన మృతుడు చంద్రశేఖర్ రెడ్డి. గత ఆరు నెలలుగా ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యలకు కారణమని పోలీసుల అనుమానం