
క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి:- కల్వకుర్తి నియోజకవర్గ ఒగ్గు బీర్ల కళాకారుల సంఘం గురువారం ఆమనగల్లు పట్టణంలోని శుభం ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేశారు. నియోజకవర్గం అధ్యక్షుడిగా బిర్ల రమేష్, ఉపాధ్యక్షుడిగా సందం వెంకటేష్‌ను ఎన్నుకున్నారు. కల్వకుర్తి,వెల్దండ మండలాల అధ్యక్షుడిగా వస్పరి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడిగా రాచూరు యాదయ్య, ఆమనగల్లు,మాడ్గుల మండలాల అధ్యక్షుడిగా పెండ్యాల మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా శ్రీశైలం, కడ్తాల్, తలకొండపల్లి మండలాల అధ్యక్షుడిగా పట్నం రామాంజనేయులు, ఉపాధ్యక్షుడిగా పడకల్ శివ పట్నం ను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ ప్రముఖ సంఘ సేవకుడు పాపిశెట్టి రాము హాజరై నూతన కార్యవర్గాన్ని పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. కళాకారుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి సంఘం ఐక్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో రామన్న మిత్రమండలి సభ్యుడు శ్రీను నాయక్, బన్నె శివ, వెంకటయ్య, రాములు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.