
క్రైమ్ మిర్రర్, చేవెళ్ల:- చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాదులో గల ఎస్కే నేచురల్ రిట్రెంట్ ఫామ్ హౌస్ లో విదేశీయుల బర్త్డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అందులో దాదాపు 51 మంది ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వీరు మొత్తం ఆఫ్రికా దేశాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇక్కడికి చేరుకొని వీసా పర్మిషన్ ఉన్నాయా అని ఆరా తీశారు. అయితే వారందరూ కూడా వ మత్తు పదార్థాలు సేవించి అన్ కాన్స్టెన్సీలో ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు 100 మంది పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఇందులో గంజాయి, డ్రగ్స్ మరియు విదేశీ మద్యం ఉన్నట్లు సమాచారం. నార్కోటిక్స్, ఎక్సైజ్ పోలీసులు వచ్చి తనిఖీలు నిర్వహించారు. దీంతో ఈ న్యూస్ చేవెళ్ల నియోజకవర్గం లో హైలెట్గా నిలిచింది.
Read also :- వీధి కుక్కల తరలింపు వివాదం.. భగ్గు మంటున్న పెట్ లవర్స్!
Read also : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ