హర్ముజ్ సముద్ర మార్గంలో సరుకు రవాణాకు ఏర్పడిన ఆటంకం గ్లోబల్ స్థాయిలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతోంది. భారత్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దేశంలో గ్యాస్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, కొంతమంది అప్రమత్తులు ముందుగానే పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకుంటున్నారు. అయితే, వీటిని ఎంతవరకు చట్టబద్ధంగా నిల్వ చేసుకోవచ్చు అనే ప్రశ్న పెరుగుతోంది. దీన్ని తెలుసుకోవడానికి ముందుగా “ఫ్లాష్ పాయింట్” అనే అంశాన్ని అర్థం చేసుకోవాలి.
ఫ్లాష్ పాయింట్ అనేది పెట్రోలియం ఉత్పత్తులు మంటతో మండటానికి సరిపోయే ఆవిరిని విడుదల చేసే కనిష్ట ఉష్ణోగ్రత. దీని ఆధారంగా పెట్రోలియం ఉత్పత్తులను మూడు వర్గాలుగా విభజించగా, ఫ్లాష్ పాయింట్ 23°C కంటే తక్కువగా ఉంటే అది క్లాస్ ఏ, 23°C-65°C మధ్య ఉంటే క్లాస్ బి, 65°C-93°C మధ్య ఉంటే క్లాస్ సిగా పరిగణించబడుతుంది.
పెట్రోల్ నిల్వ పరిమితుల విషయంలో, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం.. క్లాస్ ఏ రకానికి చెందిన పెట్రోలియంను అమ్మకం కోసం కాకుండా వ్యక్తిగత ఉపయోగానికి 30 లీటర్ల వరకు నిల్వ చేసుకోవడానికి లైసెన్స్ అవసరం లేదు. 30 లీటర్ల కంటే ఎక్కువగా నిల్వ చేస్తే చట్టబద్ధంగా నిషేధం ఉంటుంది. వ్యాపార అవసరాలకు ఈ పరిమితిని మించితే అధికారులు చర్యలు తీసుకోవచ్చు.
పెట్రోల్ ఎక్కువకాలం నిల్వ ఉంచితే అది పాడవుతుంది. గాలి రాకుండా కప్పిన పాత్రలో నిల్వ చేస్తే కొద్ది రోజుల వరకు మాత్రమే నిల్వ నిలుస్తుంది. నీడలో గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే సుమారు ఒక ఏడాది వరకు ఉపయోగపడుతుంది. అయితే, డబ్బా మూత తెరిస్తే నిల్వ కాలం తగ్గిపోతుంది. 20°C వద్ద సుమారు 6 నెలల, 30°C వద్ద సుమారు 3 నెలలపాటు పెట్రోల్ పాడవకుండా నిల్వ ఉంటుంది.
డీజిల్ పరిస్థితి కొంచెం వేరు. డీజిల్ ఎక్కువకాలం నిల్వ చేస్తే జిగురు ఏర్పడి ఇంజిన్ ఫిల్టర్లు మూతపడేలా చేస్తుంది. గాలి రాకుండా కప్పిన, నీడలోని డబ్బాలో నిల్వ చేస్తే సుమారు ఒక ఏడాది వరకు పాడకుండా నిల్వ ఉంటుంది. దీర్ఘకాలంలో నిల్వ చేయాలంటే ప్రతీ 6 నెలలకు ఒకసారి బయోసైడ్ చికిత్స అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో, పేట్రోల్, డీజిల్ నిల్వ చేసే ముందు ఫ్లాష్ పాయింట్, నిల్వ కాలం, గాలి, ఉష్ణోగ్రత అంశాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే భద్రతా సమస్యలు తక్కువగా వస్తాయి, ఇంధన నాణ్యత కూడా కాపాడబడుతుంది.
ALSO READ: కూతురి కోసం తల్లి ఆరాటం.. వీధిలో స్పృహ కోల్పోయిన మోనాలిసా తల్లి
