
-
దేవరకొండ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్లక్ష్యం
-
విద్యార్థినులకు ఉడికీఉడకని ఆహారం అందజేత
-
రాత్రి వండిన కూరలను మార్నింగ్ వడ్డించిన సిబ్బంది
-
కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక
క్రైమ్ మిర్రర్, నల్గొండ: దేవరకొండ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు వడ్డించిన ఫుడ్ పాయిజన్ కావడంతో 52మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ముదిగొండ ఎస్టీ బాలికల పాఠశాల హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి వండిన క్యాబేజీ కర్రీతో కలిపి మార్నింగ్ చికెన్ వడ్డించినట్లు తెలిసింది. దీంతో ఫుడ్ పాయిజన్ కావడం వల్ల విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు.
రాత్రంత్రా కడుపునొప్పితో తల్లడిల్లినా ఎవరికీ చెప్పుకోలేదు. ఉదయం వాంతులు, విరేచనాలు తీవ్రతరం కావడంతో విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. సాయంత్రం ఇచ్చిన స్నాక్స్‌లో బొబ్బర్లు ఉడికించకుండా, వేయించి ఇచ్చారని… దీంతో కడుపునొప్పి ఉన్నా అలాగే పడుకున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ఉడికీఉడకని పులిహోర పెట్టడంతో కడుపునొప్పి, వాంతులు, వీరేచనాలు అయి అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు వెల్లడించారు.