
-
కడుపునొప్పి, విరేచనాలతో విద్యార్థుల అవస్థలు
-
విషయం బయటకు పొక్కనివ్వని అధికారులు
-
అస్వస్థతకు గురైన విద్యార్థులను ఇంటికి పంపిన వైనం
క్రైమ్‌మిర్రర్, మహబూబ్‌నగర్: తెలంగాణలో గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. రోజుకో చోట రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్లు, ఇతరత్రా జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి అధికారుల్లో నిర్లిప్తత పెరిగిపోయిందన్న ఆరోపణలు రోజురోజుకూ ఎక్కువవుతూనే ఉన్నాయి.
తాజాగా, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 30మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్న తర్వాత కడపునొప్పి, వాంతులు, విరేచనాలతో చిన్నారులు ఇబ్బంది పడ్డారు. బాధిత విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్తే విషయం బయటపడుతుందన్న దురుద్దేశంతో, వారందరినీ సొంతింటికి పంపించివేశారు. ఈ విషయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉడికీఉడకని అన్నం, నీళ్ల చారే పెడుతున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే ఈగలు పడినా తినాల్సిందేనని, మీ ఇంటి వద్ద ఇంతకన్నా మంచి భోజనం ఉంటుందా? అని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: