
Flipkart Black Friday Sale: భారతీయ ఆన్‌లైన్ షాపింగ్‌లలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తూ, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ భారీ డిస్కౌంట్ ఫెస్టివల్‌ను ఈసారి ఫ్లిప్‌కార్ట్ “బ్యాగ్ ది బిగ్గెస్ట్ డీల్స్” అనే ప్రత్యేక ట్యాగ్‌లైన్‌తో ప్రారంభించబోతోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, ACలు, కిచెన్ అప్లయెన్సెస్ వంటి అనేక వర్గాల్లో భారీ తగ్గింపులను అందించేందుకు కంపెనీ భారీ సన్నాహాలు చేసింది. దీపావళి తర్వాత షాపింగ్ చేసేవాళ్లు ఎదురుచూస్తున్న పెద్ద ఈవెంట్ ఇదేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సేల్ ప్రారంభ తేదీ- నవంబర్ 23, 2025
ఫ్లిప్‌కార్ట్ తన అధికారిక మైక్రోసైట్‌ను విడుదల చేస్తూ ఈ సేల్ నవంబర్ 23 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ మైక్రోసైట్ ప్రస్తుతం వివిధ ఉత్పత్తులపై రాబోయే తగ్గింపులను సూచిస్తుంది. దీపావళి బిగ్ బిలియన్ డేస్ తర్వాత జరగనున్న ఈ సేల్, 2025 చివర్లో కస్టమర్లకు మరొకసారి భారీ ఆఫర్లను అందించే అవకాశం కాబోతోంది. అధిక డిమాండ్ ఉన్న ప్రీమియం ఎలక్ట్రానిక్స్ నుంచి, తక్కువ బడ్జెట్ గాడ్జెట్‌ల వరకు అనేక వాటిని దాదాపు సంవత్సరం చివరి ధరలతో కొనుగోలు చేసే అవకాశముందని అంచనా.
ఏ ఏ వస్తువులపై తగ్గింపులు?
ఫ్లిప్‌కార్ట్ ఈసారి ప్రధానంగా టెక్, హోమ్ ఎలక్ట్రానిక్స్‌పై భారీగా దృష్టి పెట్టింది. ఈ సేల్‌లో ఈ కేటగిరీలపై భారీ తగ్గింపులు లభించనున్నాయి:
తాజా స్మార్ట్‌ఫోన్‌లు
స్మార్ట్‌వాచ్‌లు
LED మరియు QLED టీవీలు
హోం థియేటర్లు
ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు
PCలు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు
ACలు, రిఫ్రిజిరేటర్లు
శీతాకాలానికి ఉపయోగించే రూమ్ హీటర్లు, గీజర్‌లు
Samsung, LG వంటి ప్రముఖ బ్రాండ్‌ల ఉత్పత్తులూ భారీ తగ్గింపులతో లభించనున్నట్లు కంపెనీ తెలిపింది. పైగా రాబోయే శీతాకాలం దృష్ట్యా, హీటర్లు, గీజర్‌లు వంటి ఉత్పత్తులను కూడా ప్రత్యేకంగా సేల్ కేటగిరీలో చేర్చినట్లు వెల్లడించింది.
చెల్లింపు ఆఫర్లు- ఏమేం అందుబాటులో ఉంటాయి?
సేల్ సమయంలో UPI, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపులను సులభంగా చేసుకునే అవకాశం ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే బ్యాంక్ ఆఫర్ల వివరాలు త్వరలో వెల్లడిచేయనున్నారు. ముందస్తు ఆఫర్లను సులభంగా పొందడానికి తమ చెల్లింపు వివరాలను యూజర్లు ముందుగానే సేవ్ చేసుకోవాలని కూడా సూచించారు.
అమెజాన్ కూడా సేల్‌కు సిద్దమేనా?
ఫ్లిప్‌కార్ట్ తేదీలు ప్రకటించడంతో పాటు, త్వరలో అమెజాన్ కూడా తన బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ రెండు దిగ్గజాలు బ్లాక్ ఫ్రైడే సందర్భంగా పెద్ద తగ్గింపులను ప్రకటిస్తూ పోటీ పడతాయి. 2025 చివరి ప్రధాన సేల్ ఇది కాబట్టి, ఈసారి కూడా పోటీ మరింత తీవ్రంగా ఉండవచ్చని అంచనా.
మొత్తం మీద, ఆన్‌లైన్ షాపింగ్ ప్రేమికులు ఎదురుచూస్తున్న భారీ డీల్ ఫెస్టివల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైపోయింది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ కొనుగోలుదారులకు గోల్డెన్ ఛాన్స్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: Viral video: రైలులో మ్యాగీ చేసిన మహిళ.. ఇదోరకం పిచ్చి అని నెటిజన్ల కామెంట్స్





