
FLASH: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ప్రపంచ దేశాల దృష్టిని తనవైపు తిప్పుకుంది. ముఖ్యంగా, పుతిన్ అరెస్ట్ వారెంట్ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో 2023లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అంటే ICC, పుతిన్‌పై అధికారిక అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. యుద్ధ నేరాలు, అనధికారిక బాలల తరలింపు ఘటనల నేపథ్యంలో ICC ఈ చర్య తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం ఐసీసీకి సభ్యులైన 125 దేశాల్లో పుతిన్ పాదం పెట్టిన చోట ఆయనను అరెస్టు చేసే అధికారం అక్కడి ప్రభుత్వాలకు ఉంటుంది. ఈ కారణంగానే పుతిన్ గత రెండేళ్లుగా ICC సభ్యదేశాలన్నిటినీ పూర్తిగా దూరంగా ఉంచారు. వాటి ఎయిర్‌స్పేస్‌ను కూడా ఆయన విమానాలు వినియోగించకుండా రష్యా ప్రత్యేక మార్గాలు ఎంచుకోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో పుతిన్ అకస్మాత్తుగా భారత్ పర్యటనకు రావడం అంతర్జాతీయ వేదికలో పెద్ద చర్చగా మారింది. అయితే ముఖ్య కారణం ఏమిటంటే.. భారత్ ICC సభ్యదేశం కాదు. అంటే, పుతిన్ అరెస్ట్ వారెంట్ ఇక్కడ అమల్లోకి రాదు. ఒకవేళ ICC అధికారికంగా భారత్‌కు పుతిన్‌ను అప్పగించమని కోరినా.. భారత్ రష్యాతో ఉన్న ఆప్యాయ సంబంధాల దృష్ట్యా ఆ అభ్యర్థనను అమలు చేసే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. భారత్-రష్యా దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ రంగ సహకారం, ఇంధన వ్యవహారాలు, జియోపాలిటికల్ సమతుల్యత వంటి అంశాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి.
అంతేకాదు, భారత్ ICC రోమ్ స్ట్యాచూట్‌కు సంతకం చేయకపోవడం వెనక కూడా ప్రత్యేక రాజకీయ, రాజ్యాంగ కారణాలున్నాయి. భారత రాజ్యాంగం, అంతర్జాతీయ న్యాయవ్యవస్థ పరస్పర సంబంధాలపై ప్రభుత్వం ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. అందువల్ల పుతిన్‌ను అరెస్టు చేసే ప్రశ్న వచ్చే అవకాశమే లేదని అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పుతిన్ పర్యటన భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంత ముఖ్యమో రష్యాకూ అంతే ప్రాధాన్యముంది. అమెరికా- యూరప్ బ్లాక్ ఒకవైపు ఉక్రెయిన్‌కు మద్దతిస్తుంటే, ఆసియా ప్రాంతంలో భారత్‌తో ఉన్న బలమైన సంబంధం రష్యా దౌత్యానికి కీలక బలంగా భావిస్తున్నారు. పుతిన్ అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ భారత్ పర్యటన సురక్షితమని రష్యా నమ్మకం కూడా ఇదే కారణం.
ALSO READ: High Court: అఖండ-2 విడుదలకు బిగ్ షాక్





