క్రైమ్జాతీయంరాజకీయం

FLASH: యువతిపై ఎమ్మెల్యే రేప్, ఆపై..?

FLASH: కేరళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాహుల్‌ మామ్‌కుటత్తిల్‌పై లైంగిక దాడి ఆరోపణలు మరొక్కసారి తీవ్ర రూపం దాల్చాయి. ఆయనపై గత వారం నమోదైన అత్యాచారం, బలవంతపు గర్భస్రావం కేసుతో సంబంధం ఉన్న విచారణ కొనసాగుతుండగా, తాజాగా మరో యువతి ఆయనపై తాజా ఫిర్యాదు చేసింది.

FLASH: కేరళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాహుల్‌ మామ్‌కుటత్తిల్‌పై లైంగిక దాడి ఆరోపణలు మరొక్కసారి తీవ్ర రూపం దాల్చాయి. ఆయనపై గత వారం నమోదైన అత్యాచారం, బలవంతపు గర్భస్రావం కేసుతో సంబంధం ఉన్న విచారణ కొనసాగుతుండగా, తాజాగా మరో యువతి ఆయనపై తాజా ఫిర్యాదు చేసింది. కేరళ వెలుపల నివసిస్తున్న 23 ఏళ్ల ఈ యువతి కాంగ్రెస్‌ హైకమాండ్‌, కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి (కేపీసీసీ) ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు పంపింది. ఈ ఫిర్యాదును పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర పోలీసు ప్రధాన అధికారి (డీజీపీ)కి పంపించినట్లు సమాచారం. అయితే డీజీపీ రవడా ఏ చంద్రశేఖర్‌ ఇంకా ఆ ఫిర్యాదు తన వద్దకు రాలేదని చెప్పారు.

ఇప్పటికే ఒక మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మామ్‌కుటత్తిల్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన అదృశ్యమైపోయారు. తాజాగా వచ్చిన ఫిర్యాదులో ఆయన తప్పుడు హామీతో అనగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి ఆరోపించింది. గతంలో తానెట్లా ఆయనను కలిశానో, ఎలా ఒక హోమ్‌స్టే తరహా భవనంలో మోసపోయానో వివరాలు కూడా ఆమె ఫిర్యాదులో పొందుపరిచింది. మామ్‌కుటత్తిల్‌కు సన్నిహితుడైన ఫెనీ నైనన్‌పై కూడా ఆమె ఆరోపణలు చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు తమ వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. కేపీసీసీ అధక్షుడు సన్నీ జోసెఫ్‌ ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు వచ్చిన వెంటనే దాన్ని పోలీసులకు ఫార్వర్డ్‌ చేశానని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు వి డి సతీశన్‌ కూడా ఫిర్యాదు వచ్చిన గంటలోపే డీజీపీకి పంపించామని చెప్పారు. ఇది క్రిమినల్‌ ఆరోపణలు కలిగిన విషయం కావడంతో పార్టీ స్థాయిలో కాకుండా నేరుగా పోలీసులకు అప్పగించామని స్పష్టం చేశారు.

సీనియర్‌ నేత కే మురళీధరన్‌ మాట్లాడుతూ.. ఫిర్యాదులో పేరు స్పష్టంగా లేకపోయినా, దాని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని డీజీపీకి పంపించామని తెలిపారు. పార్టీకి తెలిసిన వెంటనే మామ్‌కుటత్తిల్‌పై క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి ఎ పి అనిల్‌కుమార్‌ అన్నారు.

అయితే ఫిర్యాదులో ప్రస్తావించబడిన ఫెనీ నైనన్‌ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఫిర్యాదులు రాజకీయ నాటకం మాత్రమేనని అన్నారు. ఫిర్యాదుదారిపై, అలాగే వార్తలు ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన తొలి ఎఫ్ఐఆర్‌ నవంబర్‌ 28న నమోదు అయింది. ఆ ఫిర్యాదులో, అమ్మాయి గర్భిణీగా ఉన్న సమయంలో మే చివరి వారంలో రెండు రోజులపాటు ఒక అపార్ట్‌మెంట్‌లో మామ్‌కుటత్తిల్‌ తనపై అత్యాచారం చేశారని పేర్కొంది. మే 30న ఒక కారులో తన గర్భాన్ని తొలగించేందుకు జోబీ జోసెఫ్‌ ఔషధం ఇచ్చినట్లు కూడా ఆరోపణ ఉంది.

ఈ కేసు భారతీయ న్యాయ సంహితలోని పలువురు తీవ్రమైన నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద నమోదయింది. అదనంగా వ్యక్తిగత చిత్రాలను రికార్డు చేసి దుర్వినియోగం చేస్తానని బెదిరించినందుకు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66(E) కూడా చేర్చబడింది. మామ్‌కుటత్తిల్‌ గత ఆగస్టు 25న కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్‌ అయ్యారు. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనే ఒక మలయాళ నటి చేసిన ఆరోపణల తర్వాత ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి పలు మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తి కూడా ఆయనపై ఆరోపణలు చేశారు.

ALSO READ: GOOD NEWS: 40 ఏళ్ల వారికి నెలకు రూ.3000 పింఛన్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button