
Gaganyaan Mission: మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో గగన్ యాన్ మిషన్ ప్రారంభించింది. ఈ ప్రయోగంలో భాగంగా కీలక ప్రయోగానికి సిద్ధం అవుతోంది. ఈ మిషన్ లో అత్యంత కీలకమైన మానవరహిత రాకెట్ ప్రయోగం జరపనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ప్రకటించారు. తమిళనాడు కన్యాకుమారిలో జరిగిన యువ శాస్త్రవేత్తల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
2027లో గగన్ యాన్ మిషన్
2027లో మానవసహిత గగన్ యాన్ మిషన్ ను చేపట్టనున్నట్లు నారాయణ్ తెలిపారు. డిసెంబర్ లో జరిగే గగన్ యాన్ మిషన్ ద్వారా భారతీయుడిని ఏవోజీ పద్ధతి ప్రకారం రాకెట్ లో అంతరిక్షానికి పంపి.. అక్కడ పరిశోధనలు జరపనున్నట్లు తెలిపారు. పరిశోధనలు పూర్తి అయిన తర్వాత మళ్లీ భూమ్మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. మానవ రహిత రాకెట్ ను అంతరిక్షంలోకి పంపుతామని, ఆ తర్వాత మరో రెండు రాకెట్లను పంపి పరిశోధనలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 2027లో అంతరిక్షంలోకి మనిషిని పంపే గగన్‌యాన్ మిషన్ ను చేపడతామని నారాయణన్ తెలిపారు. 2040లో చంద్రుడిపై భారతీయులు అడుగుపెట్టేలా మిషన్ ను రూపొందించే ప్రయత్నాలను త్వరలోనే ప్రారంభిస్తామని ఇస్రో ఛైర్మెన్ ఇవెల్లడించారు.
గగన్ యాన్ మిషన్ కు శుభాన్షు నాయకత్వం!
ఇక 2027లో జరిగే గగన్ యాన్ మిషన్ కు తాజాగా అంతరిక్షంలోకి వెళ్లిన శుభాన్షు శుక్లా నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం కోసం ఇప్పటికే నలుగురు భారతీయ ఆస్ట్రోనాట్స్ సిద్ధం అవుతున్నారు. అందులో ఒకరైన శుభాన్లు శుక్లా యాక్సియం-4 మిషన్ ద్వారా రెండు వారాల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు. తాజాగా ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు. 28 గంటల ప్రయాణం తర్వాత అంటే.. రేపు సాయంత్రం కాలిఫోర్నియా సమీపంలో భూమ్మీదకు దిగనున్నారు. ఈ మిషన్ లో భాగంగా శుక్లా పలు కీలక పరిశోధనలు చేశారు. భూమ్మీదకు వచ్చిన తర్వాత ఆ పరిశోధనల ఫలితాలను విశ్లేషించనున్నారు.
Read Also: అంతరిక్షం నుంచి శుభాన్షు తిరుగు ప్రయాణం, భూమ్మీద దిగేది ఎప్పుడంటే?