
-
వాకింగ్ చేస్తున్న చందూనాయక్‌పై కాల్పులు
-
అక్కడికక్కడే చనిపోయిన చందూనాయక్
-
మలక్‌పేట శాలివాహన పార్కులో ఘటన
క్రైమ్ మిర్రర్, నిఘా: హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పులతో మలక్‌పేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీపీఐ రాష్ట్ర నాయకుడు చందూనాయక్ (43)పై దుండగులు కాల్పులు జరిపారు. ఉదయం శాలివాహన పార్కులో వాకింగ్‌కు వెళ్లినప్పుడు చందూనాయక్‌పై దుండగులు దాడికి తెగబడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరపడంతో చందూనాయక్ అక్కడికక్కడే చనిపోయాడు.
చందూనాయక్‌ది నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి. గత కొంతకాలంలో భూతగాదాలతో గొడవలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం భార్యపిల్లలతో కలిసి స్థానిక పార్కులో వాకింగ్ వెళ్లినప్పుడు చందూనాయక్ హత్యకు గురయ్యాడు. తమ కళ్లముందే కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్యపిల్లల రోధనలతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.