
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండపై నిన్న రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి కొండ వెనుక వైపు నుంచి శ్రీ పాత కోటేశ్వర స్వామి మార్గం వరకు మంటలు చలరేగాయి. అది చూసిన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఇక అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఆ మంటలను అదుపు చేశాయి. అయితే ఘటనకు కారణంగా ఒక వ్యక్తిని భావించగా అతనిని పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదం పై ఇప్పటికే కలెక్టర్ మరియు ఎస్పీలతో మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడడం జరిగింది. ఈ ఘటన ఎందుకు జరిగింది అనే కోణంలో ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించారు.
శ్రీశైలం వెళ్లే భక్తులు రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా: అటవీశాఖ అధికారులు
కాగా మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ పై ఘనంగా శివరాత్రి వేడుకలు జరుపుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం మీద కూడా ఒక కోటప్పకొండ అలాగే శ్రీశైలంలోనే ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుతారు. ఎన్నో వేల మంది ప్రజలు ఈ మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు చేరుకొని వారిని దర్శించుకొని ఆనందంగా ఆ ఒక్కరోజు గడుపుతారు. అంతేకాకుండా వినోదాలకు రాత్రి పూట విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసి ప్రజలను మరింత ఉత్సాహంగా, సంతోషంగా ఆ ఒక్కరోజును గడిపేలా చేస్తారు. కేవలం ఒక్క కోటప్పకొండ లోనే ఏకంగా 20 నుంచి 30 వరకు విద్యుత్ ప్రభలను కడతారు. రాష్ట్రం నలుమూలల నుండి కోటప్పకొండకు విపరీతంగా భక్తులు చేరుకుంటారు. రోజులలో మహాశివరాత్రి ఉందనగా ఈ సమయంలో ఇలాంటి ఘటన జరగడంపై అధికారులు వెంటనే అప్రమత్తము అయ్యి వెంటనే విచారణ చేస్తూ ఉన్నారు. కాగా ఘటన గురించి ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వెల్లడి కాలేదు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్
చంద్రబాబు పై నోరు అదుపులో పెట్టుకో కేసిఆర్, జగదీష్ ఖబర్దార్ : పిఎసిఎస్ చైర్మన్ రాములు యాదవ్