తెలంగాణ

జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం

Turkayamjal Municipality : తుర్కయంజాల్  ఇటీవల ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన విశాలాంధ్ర దినపత్రిక రిపోర్టర్ సూరేపల్లి శ్రీనివాస్ (Reporter Srinivas) కుటుంబ సభ్యులను రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, (Malreddy Ram Reddy) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

రిపోర్టర్ సూరేపల్లి శ్రీనివాస్ కుటుంబానికి రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి (Vangeti Lakshman Reddy) రూ.11వేలు ఆర్ధిక సాయం అందజేశారు. తుర్కయంజాల్ లోని నివాసంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను లక్ష్మారెడ్డి పరామర్శించారు.

తాము ఉన్నామని వారికి కుటుంబానికి భరోసా కల్పించారు. ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టీపీసీసీ సభ్యులు కొత్త కురుమ శివకుమార్, మున్సిపల్ అధ్యక్షురాలు కొత్త కుర్మ మంగమ్మ,టీపీసీసీ సభ్యులు కాకుమాను సునీల్, కాంగ్రెస్ నాయకులు కుంట గోపాల్ రెడ్డి మర్రి మహేందర్ రెడ్డి , కంబాలపల్లి ధన్ రాజ్, మర్రి సామ భీంరెడ్డి, నారని శేఖర్ గౌడ్, బొగ్గు శ్రీను, గుడ్ల అర్జున్, బీజేపీ నాయకులు కందాల బలదేవ రెడ్డి తదితరులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇవి కూడా చదవండి .. 

  1. అప్పుడు కావాలి జగన్‌… ఇప్పుడు మారాలి జగన్‌ – వైసీపీ భవిష్యత్‌ కోసమేనా…!

  2. అసెంబ్లీకి కేసీఆర్‌.. సభలో ఇక రచ్చరచ్చే..!

  3. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్స్… నేరగాళ్లు అరెస్ట్!..

  4. కేసీఆర్‌, జగన్‌ది ఒకటే మాట, ఒకటే బాట – అందుకు అసెంబ్లీనే సాక్షి… నిజమేనా?

  5. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సోదరుడు.. యాదాద్రిలో రచ్చ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button