తెలంగాణ

భర్తను కోల్పోయిన మహిళకు అర్ధరాత్రి వీడియో కాల్స్ చేసి వేధిస్తున్న ఫైనాన్స్ కంపెనీ..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన విజయలక్ష్మి*

తీసుకున్న రూ.2,50,000లకు రూ. 50 లక్షలు కట్టాలంటూ వేధిస్తున్న ఫైనాన్స్ కంపెనీ

ఇప్పటికే ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మహిళ భర్త

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కంచుకోటగా భావించే చింతకాని మండలంలో ఫైనాన్స్ కంపెనీ ఆగడాలు

భర్తను కోల్పోయిన తనకు ఫైనాన్స్ కంపెనీవారు అర్ధరాత్రి వీడియో కాల్స్ చేసి వేధిస్తున్నారని బోరున విలపించిన మహిళ

తన గోడును డీజీపీ జితేందర్‌కు చెప్పేందుకు విఫలయత్నం చెయ్యగా.. కార్యాలయ సిబ్బంది ఆమెను కనీసం లోపలికి అనుమతించకపోవడంతో ఆఫీసు బయటే నిరసన తెలిపిన బాధిత మహిళ

ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన భర్తకు యాక్సిడెంట్ అయితే చికిత్స నిమిత్తం 2019లో ఇంటి కాగితాలు కుదవపెట్టి రూ.2,50,000 ఫైవ్ స్టార్ ఫైనాన్స్ నుంచి తీసుకుంది

ఆ తర్వాత ఫైనాన్స్ వేధింపులకు భర్త ఆత్మహత్య చేసుకోగా, తీసుకున్న డబ్బును విడతల వారీగా రూ.3 లక్షల వరకు చెల్లించింది.. ఇదేంటని ప్రశ్నించినందుకు వారం తర్వాత రూ.4.50 లక్షలు చెల్లించాలని హుకుం జారీ చేసిన ఫైనాన్స్ కంపెనీ

దీనిపై బాధితురాలు పోలీసులను కలవడంతో ఆ మొత్తాన్ని రూ.6 లక్షల పెంచి.. తన బావగారితో కలిసివెళ్లి కంపెనీ ముందు నిరసన తెలుపగా.. చివరికి రూ.50 లక్షలు చెల్లించి సెటిల్ చేసుకోవాలని బెదిరించిన ఫైనాన్స్ కంపెనీ

డబ్బులు చెల్లించడం లేదని ఇంటికి తాళాలు వేయడం, అర్ధరాత్రి వీడియోకాల్స్ చేయడం వంటివి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఖమ్మం సీపీ చెప్పినా చింతకాని ఎస్సై కేసు నమోదు చేయడం లేదని డీజీపీ ఆఫీసు ఎదుట కన్నీటి పర్యంతమైన మహిళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button