క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :–
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఫిలిం ఇండస్ట్రీ చైర్మన్ అయినటువంటి దిల్ రాజ్ తాజాగా తనపై జరిగినటువంటి ఐటీ సోదాలపై స్పందించాడు. నేను సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నాను. నాపై ఎప్పుడూ కూడా ఇలాంటి ఐటీ రైడ్స్ అనేవి జరగలేదని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా తనపై జరిగినటువంటి ఐటీ సోదాలు పై స్పందిస్తూ కొన్ని వివరాలను తెలియజేశారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణం అని తెలియజేశారు. నాపై రైడ్లు చేసేటప్పుడు నేను వారికి సహకరించానని నిర్మాత దిల్ రాజ్ అన్నారు. నా అకౌంట్స్ అన్ని తనిఖీ చేసి స్టేట్‌మెంట్స్ తీసుకున్నారు అని తెలిపారు. ఐటీ రెయిడ్స్ జరిగినప్పుడు ఎకౌంట్లో రూ.20లక్షలలోపే ఉంది అని అన్నారు. సినీ నిర్మాణంలో ఉన్నందున అన్ని రకాలుగా అన్నిటినీ తనిఖీ చేస్తారు, కాబట్టి వారికి సహకరించాలని అన్నారు. నా ఇంట్లో సోదాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని తనిఖీ చేసిన తర్వాత ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు అని చెప్పుకొచ్చారు. మా లావాదేవీలన్నీ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయని తెలిపారు. మా ఇంట్లో ఉన్న డబ్బులు, డాక్యుమెంట్లు ఏ ఒక్కటి కూడా స్వాధీనం చేసుకోలేదు అని అన్నారు. వచ్చేనెల ఒకసారి ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని ఫిల్మ్ ఇండస్ట్రీ చైర్మన్ రాజు చెప్పుకొచ్చారు.
Read also
1పబ్లిక్ లో కలెక్టర్ పై మండిపడ్డ పొంగులేటి!… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు?
2.బ్యాంకు అధికారిని ముంచిన స్కామార్లు!… ఏకంగా 78 లక్షల టోకర?