
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే గతంలో అతను టిడిపికి బాగా బలంగా సపోర్ట్ చేయడమే కాకుండా ఫైబర్ నెట్ విషయాలలోను బాగా తెలిసిన వ్యక్తి కూడా. అయితే తాజాగా ఫైబర్ నెట్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా టిడిపికి అలాగే ఆ పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లుగా తెలిపారు. వ్యక్తిగత కారణాలతోని రాజీనామా చేస్తున్నట్లు జీవి రెడ్డి వెల్లడించారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని ప్రకటించారు. కాగా ఫైబర్ నెట్ ఎండి, ఐఏఎస్ దినేష్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని జీవి రెడ్డి ఆరోపించారు. దీనిపై జీవి రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్లుగా కూడా సమాచారం ఉంది.
ఎన్నికల పై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత..
అయితే ప్రస్తుతం జీవి రెడ్డి రాజీనామా టిడిపిలో కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఫైబర్ నెట్ అక్రమాలను ధైర్యంగా జీవి రెడ్డి బయటపెట్టారు. ఇంత చేసిన జీవి రెడ్డికి పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదని అందరూ అనుకుంటున్నారు. మంచి సబ్జెక్ట్ అలాగే యువనేత దూరం అవడం పార్టీకి ఎంతో కొంత నష్టం తెస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాడర్ కంటే అధికారుల కే పెద్దపీట వేస్తున్నారని అసంతృప్తి చాలా మందిలోనూ ఉంది. తిరిగి మళ్లీ జీవి రెడ్డిని టిడిపిలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే తీర్మానం పదవికి జీవి రెడ్డి రాజీనామా చేయడం అనేది పార్టీకి కొంతమేర నష్టం కలగవచ్చు.
1. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన చండూరు సన్ షైన్ పాఠశాల విద్యార్థులు..