
ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్:-పండుగలు ప్రజల్లో సోదరభావాన్ని నింపుతాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించే ఇఫ్తార్ విందులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ పాత గ్రామంలో ఉన్న చిన్న మసీదులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులకు పండ్లను తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు పండుగలను కలిసి మెలిసి జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మల్లేష్ ముదిరాజ్, భాస్కర్ సాగర్, అమీర్, నవీద్, హలీమ్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలో దారుణం… మైనర్ బాలికపై అత్యాచార యత్నం… !
అమీన్‌పూర్‌లో దారుణం- పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్