
జగిత్యాల జిల్లా,క్రైమ్ మిర్రర్:-
గొల్లపల్లి మండలం రంగదామున్నిపల్లె గ్రామంలో సాక్షాత్తు గ్రామపంచాయతీ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో కరెంటు సరఫరా లేక పంటలు ఎండుతున్నాయి. వరి నారు ఎండకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు.పది రోజులైన ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత పది సంవత్సరాల నుండి ఎలాంటి విద్యుత్ కొరత లేకుండా ఉన్నాం ట్రాన్స్ఫారం కాలిపోయిందని స్థానిక నాయకులుకు విద్యుత్ అధికారులకు చెప్పిన కూడా పట్టించుకునే నాధుడే లేడు. ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మీరన్న దయతలిచి మా ట్రాన్స్ఫర్ సమస్యను పరిష్కరించగలరని ఈ ట్రాన్స్ఫారం పరిధిలో 25 నుంచి 30 మంది రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది అని రైతులు వేడుకుంటున్నారు.