
క్రైమ్ మిర్రర్, పరకాల:- పరకాల మండలంలోని వెంకటాపురం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ రైతుల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చందుపట్ల రాజిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చును తగ్గించుట, అవసరం మేరకు రసాయనాలు వినియోగం ,రైతు సోదరులకు రసీదులను భద్రపరుచుకోవడం ,పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు ,చెట్లను పెంచడం, సాగునీటిని ఆదా చేయడం వలన కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించడం జరిగింది .వీటితో పాటుగా వెంకటాపూర్ గ్రామంలోని వివిధ పంటలలో సస్యరక్షణ చర్యల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బి. రాజు ,డాక్టర్ కే .స్వాతి, వ్యవసాయ విస్తరణాధికారులు కాటంరాజు, వ్యవసాయ కళాశాల వరంగల్ విద్యార్థులు, వెంకటాపూర్ గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.