
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :-మోసపూరిత మాటలకు లొంగి రైతులు సైబర్ నేరాలకు గురికావొద్దు అని జిల్లా సహకార బ్యాంకు మునుగోడు మేనేజర్ దీప్తి అన్నారు. మునుగోడు మండల కేంద్రములో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో జిల్లా సహకార బ్యాంక్ ఆధ్వర్యములో రైతులకు ఆర్ధిక అక్షరాస్యత,నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మేనేజర్ దీప్తి పాల్గొని అవగాహన కల్పించారు. స్వల్పకాలిక రుణాలపై కేంద్ర ప్రభుత్వం అందించే ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించారు. అప్పుపై 3 శాతం ఇంట్రెస్ట్ మాఫీ సక్రమంగా వడ్డీలు కట్టిన రైతులకు వర్తిస్తుందని,10 నిమిషాల్లో గోల్డ్ లోన్ అందించడం జరుగుతుందన్నారు. ఖాతాదారులు మరణించిన యెడల 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తింపు చేస్తుందన్నారు. మండల ప్రజలు రైతులు ప్రతి ఒక్కరు సహకార బ్యాంక్ అందించే సేవలను వినియోగించుకోవాలని ,సలహాల కొరకు మునుగోడు బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించవచ్చు అన్నారు. బ్యాంక్ సూపర్వైజర్ నరేష్,సంఘం కార్యదర్శి పాలకూరీ సుఖేందర్,సంఘం సిబ్బంది అశోక్ రెడ్డి,దుబ్బ పురుషోత్తం,స్వామినాథ్, లింగస్వామీ,శేఖర్, రాకేష్,మండల రైతులు పాల్గొన్నారు.
Read also : సెప్టెంబర్ లో సగం రోజులు బ్యాంకులు బంద్, కారణం ఏంటంటే?
Read also : సెప్టెంబర్ రెండో వారంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్!