క్రైమ్

ఏకంగా నకిలీ పోలీస్ స్టేషనే ఏర్పాటు, వీళ్లు మామూలోళ్లు కాదురా అయ్యా!

Fake Police Station: కేటుగాళ్లు రోజు రోజు తెలివి మీరిపోతున్నారు. ఇప్పటి వరకు నకిలీ బ్యాంకులను చూశాం. నకిలీ చెక్ పోస్టులను చూశాం. కానీ, తాజాగా నకిలీ పోలీస్ స్టేషన్ వెలుగులోకి వచ్చింది. చూడ్డానికి అచ్చం పోలీస్ స్టేషన్ మాదిరిగానే ఉంటుంది. ఎస్సై, కానిస్టేబుళ్లు ఉంటారు. పోలీసు వాహనాలు కూడా ఉంటాయి. సాయంత్రం అయితే, చెకింగ్స్, రాత్రి అయితే పెట్రోలింగ్. ఏడాదిగా అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ స్టేషన్ ఏర్పాటై ఏడాది గడుస్తుండగా, తాజాగా ఈ వ్యవహారం బయటకు రావడంతో అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

బీహార్ లో నకిలీ పోలీస్ స్టేషన్!

బీహార్ లో ఓ వ్యక్తి ఏకంగా గత ఏడాదిగా ఫేక్ పోలీస్ స్టేషన్ నడిపి అందరినీ షాక్ కి గురి చేశాడు. పూర్ణియా జిల్లాలో రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి ఉండేవాడు. పని పాట ఏమీ చేసేవాడు. కాదు, మద్యం కోసం అడ్డదారులు తొక్కేవాడు. కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఓసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో అతడికి ఓ ఆలోచన వచ్చింది. ఓ నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అనుకున్నాడు. తన దగ్గరి మిత్రులతో ఈ విషయాన్ని చెప్పాడు.

మారుమూల గ్రామాన్ని ఎంపిక చేసుకుని..

కొద్ది రోజుల్లోనే తమ ఆలోచనను ఆచరణలో పెట్టారు. మారుమూల గ్రామం అయిన బటౌనాలో ఓ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. రాహుల్ ఈ స్టేషన్ కు ఎస్సైగా ఉన్నాడు. ఆయనకు తోడుగా కానిస్టేబుల్స్ ను, చౌకీదార్ లను నియమించుకున్నాడు. అందరికీ యూనీఫామ్ లు, లాఠీలు, ఐడీకార్డులు అందించాడు. ఏడాదిగా ఈ స్టేషన్ ను రన్ చేస్తున్నాడు. పెట్రోలింగ్ చేయడం, మద్యం అక్రమ రవాణాపై దాడులు చేయడం మొదలు పెట్టారు. వాహనదారుల నుంచి అక్రమార్కుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూళు చేసేవాళ్లు. తాజాగా ఆ రూట్ లో పోలీసు ఉన్నతాధికారులు వెళ్తున్న సమయంలో ఈ పోలీస్ స్టేషన్ చూసి షాకయ్యారు. రాహుల్ సహా అందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఈ విషయం తెలిసి పరిసర ప్రజలు షాకయ్యారు.

Read Also: ఇష్టం లేని పెళ్లి, హనీమూన్ కు తీసుకెళ్లి భర్తను హత్య చేయించిన భార్య!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button