క్రైమ్

సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు

సూర్యాపేట లో మరో అక్రమాల బాగోతం బహిర్గతమైంది. సూర్యాపేటలో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఆసుపత్రిలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ , ఐఎంఏ , డీఎంహెచ్ఓ సంయుక్త దాడులు నిర్వహించారు .శరత్ కార్డియాక్ సెంటర్ ను సీజ్ చేశారు . ఒక డాక్టర్ పేరుతో అనుమతి తీసుకుని మరో డాక్టర్ పేరుతో ఆసుపత్రి నడుపుతున్నారని అధికారులు గుర్తించారు. నకిలీ వైద్యులపట్ల అప్రమత్తం గా ఉండాలని టీజీఎంసీ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ రాజీవ్ తెలిపారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌ ( టీజీఎంసీ) బృందం శరత్ కార్డియాక్ సెంటర్‌ పై ఫిర్యాదు రావడం తో వారు తనిఖీ నిర్వహించారు.ఈ తనిఖీ లో వనం శరత్ చంద్ర, 2D ఎకో టెక్నీషియన్, డా. శిరీష క్లినికల్ కార్డియాలాజిస్ట్ పేరు మీద వారు లేకుండానే తాను కూడా డాక్టరు అని పేర్కొంటూ ప్రశాంత్ అనే పేషంట్ కి 2డి ఈ సి హెచ్ ఓ రిపోర్ట్ అందిస్తున్నట్లు గుర్తించారు.PCPNDT చట్టం ప్రకారం గుండె వైద్య నిపుణుడు డా. లీలా కృష్ణ పేరుమీద అనుమతి తీసుకునట్టుగా గుర్తించ్చారు.

వైద్య నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా, రోగుల ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగించే విధంగా ఉన్నాయని వారు తెలిపారు.డా. లీలాకృష్ణ, కార్డియాలజిస్టు డా. శిరీష, కి నోటీసులు జారీ చేసి, వారు తమ పేరు వినియోగించబడటానికి సంబంధించిన వివరాలు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన తర్వాత ఎతిక్స్ కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోబడతాయని తెలిపారు, వనం శరత్ చంద్ర పై డాక్టరు అని పేర్కొంటూ వైద్య సేవలు అందించినందుకు చట్టం ప్రకారం ఫోర్జరీ కేసు నమోదు చెయ్యనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి .. 

  1. దిల్ షుగ్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్.. 12 ఏళ్లుగా ఏం జరిగింది.

  2. నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!

  3. అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్

  4. సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్

  5. ఏపీలో లిక్కర్‌ స్కామ్‌ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్‌ వైపుకా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button