
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- సాధారణంగా పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన అభిషేక్ అనే పదో తరగతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయ్యాడు. 600 మార్కులకు గాను కేవలం 200 మార్కులు మాత్రమే సాధించాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కచ్చితంగా అభిషేక్ అనే విద్యార్థిని లాగిపెట్టి చెంప మీద ఒకటి ఇవ్వడమో లేక తిట్టడమో చేయలేదు. ఒక్కగానొక్క కొడుకుని… కొట్టడం లేదా తిట్టడం ఇష్టం లేక.. తన బాధను అర్థం చేసుకొని ఆ తల్లిదండ్రులే మరోసారి పరీక్ష రాసి పాస్ అవ్వు అని ప్రోత్సహించారు. పరీక్షల్లో ఫెయిల్ కావడం అంటే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు అని… కేక్ కట్ చేయించి ఆ ఆ కొడుకుకి తినిపించారు తల్లిదండ్రులు. భవిష్యత్తు మరింత ఉందని ఆ కొడుకుని ప్రోత్సహించారు.
ఇదిలా ఉండగా అభిషేక్ తల్లిదండ్రులు చేసిన ఈ పనిని మెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉండగా… ఇలా చేయడం మంచి పద్ధతి కాదని చాలామంది విమర్శిస్తున్నారు. ఈ కాలంలో పరీక్షల్లో ఫెయిల్ అయితే లేదా రెండు మార్కులు తక్కువ వచ్చినా కూడా చాలామంది విద్యార్థులు జీవితమే పోయినట్లుగా ప్రాణాలు బలి తీసుకుంటున్నా సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులే పిల్లల్ని మందలించే సంఘటనలు చూస్తున్నాం. కానీ పరీక్ష తప్పితే ఇంట్లోనూ అలాగే బయట సొసైటీలోనూ అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏముంది అని.. ఎవరేమనుకుంటే మనకెందుకులే అని అభిషేక్ తల్లిదండ్రులు చేసిన గొప్ప పనిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ విషయమే తెగ వైరల్ అవుతుంది. కొడుకు పరీక్ష తప్పితే చుట్టుపక్కల వాళ్ళను పిలిచి మరి.. కేక్ తెప్పించి కట్ చేయించి… ఒక చిన్నపాటి వేడుకగా నిర్వహించారు. మరోసారి పరీక్షలు రాసి పాస్ అవ్వాలని కొడుకుకి సూచించారు.
ఆంధ్రప్రదేశ్ కు రెడ్ అలర్ట్!.. పిడుగులు పడే అవకాశం.. జర జాగ్రత్త?