
-
కుప్పకూలిన ఎఫ్-7బీజీఐ ఎయిర్‌క్రాఫ్ట్
-
బంగ్లాదేశ్‌లో ఓ పాఠశాలపై పడిపోయిన విమానం
-
భారీగా చెలరేగిన మంటలు, దట్టమైన పొగ
-
పైలట్‌సహా 19మంది దుర్మరణం
-
మృతుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు!
-
మృతుల సంఖ్య పెరిగే అవకాశం, కొనసాగుతున్న సహాయ చర్యలు
క్రైమ్‌మిర్రర్, నిఘా: బంగ్లాదేశ్‌లో ఎఫ్-7బీజీఐ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. ఢాకాలోని ఓ స్కూల్ బిల్డింగ్‌పై ఈ విమానం పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. స్థానిక మైల్‌స్టోన్ పాఠశాలపై బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాద సమయంలో విద్యార్థులంతా స్కూల్‌లోనే ఉన్నారు. ప్రమాదం జరగ్గానే పెద్ద ఎత్తున మంటలు, భారీగా పొగలు చెలరేగాయి.
ఈ దుర్గటనలో శిక్షణలో ఉన్న పైలట్‌సహా 19మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలైనట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, దుమ్ము వ్యాపించాయి. అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఎఫ్-7 బీజీఐ ఎయిర్‌క్రాఫ్ట్ కూలినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు ధృవీకరించారు.
Read Also: