
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు నిన్నటి నుంచి బంద్ చేపట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కాలేజీలు బంద్ నిర్వహించారు. అయితే నిన్న ఈ బంద్ పై ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి రమేష్ నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేడు జరిగేటువంటి అన్ని పరీక్షలను బహిష్కరిస్తున్నట్లుగా యాజమాన్య సంఘంలో ప్రకటించింది. ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తంలో భాగంగా 5000 కోట్లు చెల్లించేంతవరకు ఆందోళన ఉదృతంగా కొనసాగుతుంది అని ఈ ఉన్నత విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి రమేష్ నాయుడు హెచ్చరించారు. అంతేకాకుండా ఈ ఏడాది విద్యారంగానికి కేటాయించినటువంటి నిధులన్నీ కూడా ఎక్కడ ఖర్చు చేశారు అనేది ప్రతి ఒక్కటి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ మరియు బీఈడీ వంటి కాలేజీలను మూసివేశారు. బంద్ నిర్వహించిన కూడా ప్రభుత్వం స్పందించట్లేదు అని.. అయినప్పటికీ స్పందించకపోతే ఈనెల 6వ తేదీన లక్షకు పైగా సిబ్బందితో భారీ సభలను ఏర్పాటు చేస్తామని.. అప్పటికి స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరికలు కూడా చేశారు. మరి ఈ సందర్భంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.
Read also : కన్యక పరమేశ్వరి ఆలయంలో కనుల పండగ.. లక్ష దీపోత్సవం!
Read also : ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించే వరకు కాలేజీల నిరవధిక బంద్
				
					
						




