![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-55.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా బీర్ల ధరలు పెంచిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ధరల పెంపుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ మద్యం అమ్మితేనే రాద్ధాంతం చేసిన మీరు ఇవాళ ఒక బీరుకు 30 రూపాయలు నుంచి 40 రూపాయలు వరకు కనివిని రీతిలో పెంచడం ఏంటి అని మండిపడ్డారు. ఈ బీర్ల ధర పెంచడం దేనికి సంకేతం అని అన్నారు. అంటే మేము ధరలు పెంచి మధ్యమమ్మితే మీరు ధర్నాలు అన్ని చేయొచ్చు?… మరి ఇప్పుడు మీరు మద్యం అమ్మటమే కాకుండా వాటి ధరలు కూడా పెంచుతున్నారు అని మండిపడ్డారు.. అంటే మీకు ఒక న్యాయం?.. మాకు ఒక న్యాయమా అని తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వను ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నీచపు పాలన జరుగుతుందని తీవ్రంగా ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి
1.టార్చర్ భరించలేను.. బీజేపీ నుంచి వెళ్లిపోతా! రాజాసింగ్ సంచలనం
2.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజగోపాల్ రెడ్డి?
3.నారా లోకేష్ రెడ్ బుక్ తరహాలో… పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం!.. ఎవరిని కూడా వదిలిపెట్టం?