![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-39.jpeg?lossy=1&strip=1&webp=1)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, సినీ తరహాలో మధ్య, విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని మై హోం విల్లాలో అరెస్ట్ చేసారు. ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని నాలుగు రోజుల క్రితం వంశీ కిడ్నాప్ చేపించారు. ఈ కేసు విషయం పై వంశీ పై పోలీసులు నిఘా పెట్టారు..
నిన్న హైదరాబాద్ లోని ఒక ప్రముఖ వైసీపీ నేత ఫాం హౌస్ లో పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి వంశీ కూడా వచ్చారు. దీన్ని పసిగట్టిన విజయవాడ పోలీసులు, వంశీని వెంబడించారు. ఈ రోజు తెల్లవారుజామున తప్ప తాగి హైదరాబాద్ లోని తన నివాసంలో పడి ఉన్న వంశీని పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో, బనీన్, షార్ట్ తో వంశీ ఉన్నారు. ఇప్పుడే బట్టలు మార్చుకుని వస్తానని చెప్పిన వంశీ, వంటగదిలో నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా, మహిళా కానిస్టేబుల్ వంశీని పట్టుకుని దేహశుద్ధి చేసి, కారు ఎక్కించి, విజయవాడ తరలిస్తున్నారు.