
మద్దూర్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి,
నారాయణపేట జిల్లా :- ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని కొత్తపల్లి మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, బాధితుడు ఎల్లాప్ప కుటుంబాన్ని పరామర్శించారు.మీడియా సమావేశం నిర్వహించి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా అరాచకాలను మానుకోవాలని విమర్శించారు. బాధితుడు అల్లిపురం గ్రామానికి చెందిన ఎల్లప్పను పోలీసులు కొట్టడం చాలా బాధాకరమని ఉన్నారు ఎల్లాప్పను ను కొట్టిన ఎస్సై,సీఐ,మరియు అల్లిపూర్ గ్రామం మాజీ సర్పంచ్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు మూడు రోజుల్లో వారిపై చర్యలు తీసుకోకుంటే మద్దూర్ మండల బందుకు పిలుపునిస్తానని డిమాండ్ చేశారు. అదేవిధంగా మద్దూరు మండల ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ ముదిరాజులపై దాడులు చేయడం సరికాదన్నారు.
దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చర్య తీసుకోని ఎడల మద్దూరు మండల ముదిరాజ్ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కొత్తపల్లి మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మద్దూరు మండల అధ్యక్షులు కంచర్ల గోపాల్,ఎండి సలీం,మహిపాల్ గౌడ్,నెల్లి రాములు,సాయిలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
1. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది!… 100% అధికారంలోకి నేనే వస్తా : KCR
2.బాధితునిపై మద్దూర్ ఎస్సై దాడి… పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేసిన పలు సంఘాల నాయకులు!