
తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ పోరు ముదురుతోంది. సగానికి పైగా నియోజకవర్గాల్లో పార్టీ రెండు, మూడు వర్గాలుగా విడిపోయింది. పాత, కొత్త నేతలతో ఎక్కడ సమావేశం జరిగినా గొడవలే జరుగుతున్నాయి. ఎంపీలను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలను ఎంపీలు ఖాతరు చేయడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులను కూడా ఎమ్మెల్యేలు దేఖడం లేదు. ఎవరికి వారే యుమనా తీరే అన్నట్లుగా లీడర్లు ఉండటంతో.. కాంగ్రెస్ కేడర ఆగమాగమవుతోంది.
కాంగ్రెస్ వర్గ పోరు తట్టుకోలేక కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాను కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్లనని చెప్పారు. కేసీఆర్ దేవుడు.. ఆయనకు పాదాభివందనాలని కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే చెప్పానని తెలిపారు. తనను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని పార్టీలో తీసుకునేటప్పుడు చెప్పలేదనే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చానని కోనేరు కోనప్ప చెప్పారు. రాజకీయంగా బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తనను ఓడించిన వ్యక్తిని పార్టీలోకి తీసుకున్నందుకే.. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చానన్నారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు.