క్రైమ్

జీతం రూ. 15 వేలు.. ఆస్తి రూ. 30 కోట్లు!

Ex-Karnataka Clerk: ఆయనో కాంట్రాక్టు ఉద్యోగి. జీతం నెలకు రూ. 15 వేలు. కానీ, ఆయన ఆస్తుల విలువ ఏకంగా రూ. 30 కోట్లు. ఈ ఆస్తులు చూసి అధికారులే షాక్ అవుతున్నారు. ఒక క్లర్క్ గా పని చేస్తున్న ఆయన ఇంత అవినీతికి ఎలా పాల్పడ్డాడా? అని పరేషన్ అవుతున్నారు. లెక్కలు చూపని ఆస్తుల విలువ రూ. 30 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఏకంగా 24 ఇండ్లు, 5 ప్లాట్లు, 40 ఎకరాల భేమి, కార్లు, బంగారం ఉన్నాయి.

ఇంతకీ ఈ ఘనాపాటి ఎవరంటే?

ఈ భారీ అవినీతి తిమింగలం కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న కళకప్ప నిడగుంది. ఆయన 2003లో కాంట్రాక్టు పద్దతిన చెత్త ఊడ్చే పనిలో చేశారు. అతడి తొలి జీతం నెలకు రూ.200. 17 ఏళ్ల సర్వీసు తర్వాత క్లర్క్‌ స్థాయికి చేరాడు. ఈ నేపథ్యంలో కేఆర్‌ఐడీఎల్‌ లో పనిచేసే కొందరు అధికారులతో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. 2023-24 మధ్య చేపట్టిన పనుల్లో రూ.72 కోట్ల దాకా అక్రమాలు జరిగాయని అధికారులు గుర్తించారు. 96   ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు సృష్టించి.. ఈ సొమ్మును కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ చించోళ్కర్‌, కళకప్ప పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2024లో వీరిద్దరినీ సస్పెండ్‌ చేశారు. అప్పటికి కళకప్ప నెల జీతం రూ.15 వేలు.

విచారణలో విస్తుపోయే అంశాలు

ఇక కళకప్ప అక్రమాల గురించి లోకాయుక్త బృందం సమగ్ర ఆధారాలు సేకరించింది ఈ ఆస్తులు ఆయన భార్య, సోదరుడి పేర్లపై ఉన్నాయి. పలువురి బినామీల పేరిట కూడా ఆస్తులు బయటపడ్డాయి.  జూలై 23న ఐఏఎస్‌ అధికారి వసంతి అమర్‌ తో సహా 8 మంది అధికారులకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. రూ.37.42 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Read Also: ‘డెడ్ ఎకానమీ’.. రాహుల్ కామెంట్స్ ను ఖండించిన శశిథరూర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button