
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా, మహిళా నాయకులపై టీడీపీ నేతలు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎన్నికల బరిలో నిలిచేందుకు వచ్చిన మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం, బూతులు తిడుతూ భౌతిక దాడులకు దిగడం అన్యాయమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచక చర్యలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసలు మనిషేనా? అని పరుష పదజాలంతో ప్రశ్నించారు.నెల్లూరు స్థానంలో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడ ZPTC YCP అభ్యర్థిగా ఉన్న నిరీషా నామినేషన్ పత్రాలను పోలీసులు చూస్తుండగానే టీడీపీ నేతలు చింపేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “పోలీసుల ఎదుటే ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా నామినేషన్ కాగితాలు చింపేయడం ధర్మమేనా?” అని ఆయన నిలదీశారు. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
విజయ్ నా లక్కీ చార్మ్.. ఆయన నా ఫేవరెట్ స్టార్!”: సమంత ఆసక్తికర వ్యాఖ్యలు