Wednesday, March 18, 2026
Homeతెలంగాణకాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్, ఆయన చెప్పింది ఇదే!

కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్, ఆయన చెప్పింది ఇదే!

KCR Kaleshwaram Commission Enquiry:  కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యామూర్తి పీసీ ఘోష్ ఆధ్వర్యం కొనసాగుతున్న విచారణ ముగిసింది. ఇప్పటి వరకు 114 మంది అధికారుల, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ మంత్రులను ప్రశ్నించిన కమిషన్.. తాజాగా 115వ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించింది. బీఆర్కే భవన్ లో జస్టిస్ ఘోష్ ఆయనను సుమారు 40 నిమిషాల పాటు విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక ప్రశ్నలు అడిగారు. ఆయన అన్నింటికీ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ ను 18 ప్రశ్నలు అడిగిన ఘోష్   

అటు విచారణ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్.. కేసీఆర్ ను మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అని అడిగారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రీఇంజినీరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది. ఆనకట్టల నిర్మాణాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం ఉందా? అని ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్ ఆమోదంతోనే వాటిని నిర్మించినట్లు వివరించారు. వ్యాప్కోస్ సూచనల ప్రకారమే నిర్మాణం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన ఓ బుక్ ను ఘోష్ కు అందించారు.

నీటి నిల్వ అంశంపై ఇంజినీర్లు పర్యవేక్షణ

అటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ గురించి ఘోష్ కమిషన్ పలు వివరాలు అడిగి తెలుసుకుంది. ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు. అటు బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి ప్రశ్నించగా, ఆ విషయాన్ని ఇంజినీర్లు చూసుకుంటారని వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణ సంస్థ ఎంపిక, మార్పులు టెక్నికల్ అంశాన్ని కేసీఆర్.. నీటి లభ్యత ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మించినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ బుక్‌ను కమిషన్‌కు అందించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన కేసీఆర్, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభివవాదం చేస్తూ వెళ్లిపోయారు. కేసీఆర్ విచారణ సందర్భంగా 9 మంది బీఆర్ఎస్ కీలక నాయకులు ఆయనతో ఉన్నారు.

Read Also: సిట్ విచారణకు ప్రభాకర్ రావు, అన్నింటికీ ఒకే సమాధానం!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments