
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి,వేములపల్లి:- జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు గ్రామస్థాయిలో విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు . బుధవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన మిషన్ రోడ్ సేఫ్టీ. రోడ్ రూల్స్ రోడ్ రెస్పాన్సిబిలిటీ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి పౌరుడు రోడ్డు భద్రత రోడ్డు నియమాలను రోడ్డు బాధ్యతలను గుర్తించి నడుచుకోవడం ద్వారా ప్రమాదాలకు గురికాకుండా ఉంటామని ఆయన అన్నారు. అతివేగంతో ప్రయాణం చేయడం ద్వారా గమ్యానికి తొందరగా చేరుకుందామని ఆత్రుతతోనే నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయని అదే నెమ్మదిగా ప్రయాణించినట్లయితే సురక్షితంగా గమ్యాలకు చేరుకోవచ్చు అన్నారు.
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడపాలని, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని హెల్మెట్ ధరించడం వంటి నియమాలను ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చున్నారు, గ్రామస్థాయి నుంచే రోడ్డు ప్రమాదాల నివారణకు విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలు చక్కగా ఉపయోగపడతాయని ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను ఎప్పటికప్పుడు గుర్తించి కమిటీల దృష్టికి తీసుకువచ్చి చర్చించడం ద్వారా వాటి నివారణకు సత్వర చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. రోడ్డుపై ఎప్పుడు కూడా రాంగ్ రూట్లో ప్రయాణం చేయరాదని అలా ప్రయాణించి తమ అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకొని తమ కుటుంబాలను అనాధలుగా మార్చవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ప్రాంతీయ వైద్యశాల డాక్టర్ రోహిత్ సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రాజశేఖర్ రాజు, రూరల్ సీఐ పీఎన్డి ప్రసాద్, డి టి ఆర్ బి సి ఐ అంజయ్య, ఎస్ఐలు, డి వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్ఐలు నరసింహారావు, రమణయ్య, హెడ్ కానిస్టేబుల్, సామ్యూల్, ప్రేమ్ సింగ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.