క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్ :- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజును రాష్ట్రవ్యాప్తంగా నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహం చేసుకుంటుండగా మరోవైపు ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బంధం ప్రకటించింది. దీంతో ఒకేరోజు రెండు ఉత్సవాలను పవన్ కళ్యాణ్ అభిమానులు జరుపుకొనున్నారు. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుండగా ఇక సాయంత్రం పూట ట్రైలర్ ను వీక్షించడానికి అభిమానులందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఇక చివరిగా విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమాపై ఫ్యాన్స్ కు ఎంతగానో ఆశలు ఉన్నాయి. హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు విడుదల కాబోతుంది. ఇక మార్చి 19వ తేదీన ఉగాది కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరి పవన్ కళ్యాణ్ చివరి సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో లేదా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం
అక్రమ సంబంధాల్లో హైదరాబాద్ ఏ స్థానంలో ఉందో తెలుసా…? తెలుసుకుంటే మైండ్ బ్లాంక్ కావాల్సిందే….
