
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- “కొణిదల శివశంకర వరప్రసాద్”… ఈ పేరు అప్పట్లో తెలియకపోవచ్చు. కానీ నేడు శివ శంకర్ వరప్రసాద్ అనే పేరు వినగానే చిరంజీవి అని చెప్పేస్తారు. అలాంటి చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టి నేటికీ 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దాదాపు 47 ఏళ్ల పాటు హీరోగా సినిమా ఇండస్ట్రీలో వరుసుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అంటే.. అది మామూలు విషయం కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జీవితకాలం చేయొచ్చు కానీ… హీరోగా జీవితకాలం చేయాలంటే రాసిపెట్టి ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేటికీ 47 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లుగా ట్వీట్ చేశారు. “కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ అనే నేను 1978 సెప్టెంబర్ 22వ తేదీన ప్రయాణం ఖరీదు అనే సినిమా ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమై నీటికి 47 ఏళ్లు పూర్తయ్యాయి” అని రాసుకోచ్చారు. ఇక ఈ చిత్రం ద్వారా నటుడిగా ప్రాణం పోసి, మీ అందరికీ ఒక అన్నయ్యలా, ఒక కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా… ఈ మెగాస్టార్ ని అనుక్షణం ఆదరించినటువంటి తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు అప్పుడే 47 ఏళ్లు పూర్తయ్యాయా?.. అని షాక్ కు గురవుతున్నారు. మరికొందరు ఈ ఏజ్ లో కూడా హీరోగా సినిమాలు చేస్తున్నందుకుగాను చిరంజీవికి సెల్యూట్ చేస్తున్నారు. చిరంజీవి ఒక సినిమా రంగంలోనే కాకుండా ఎంతోమందికి తన బ్లడ్ క్యాంప్ ద్వారా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇలా ఒకవైపు సినిమా మరోవైపు సహాయం చేస్తూ అందరి మనసులను దోచుకున్నాడు. నేడు పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, వరుణ్ తేజ్, బన్నీ వీళ్ళందరూ కూడా సినిమా రంగంలో రాణించడానికి ముఖ్య కారణం చిరంజీవి.
Read also : ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్… ఏపీలో రెచ్చిపోతున్న వర్షాలు!
Read also : చౌటుప్పల్‌లో OG సినిమా ఫస్ట్ షో టికెట్ రికార్డు