క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి జిల్లా:- మాడ్గుల మండలంలో ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, అనేక సంవత్సరాలుగా పన్నులు చెల్లిస్తున్న ప్రజలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థలాలు విక్రయించిన పట్టాదారులు రెవెన్యూ రికార్డులను సకాలంలో సవరించకపోవడంతో, పట్టాదారు పాసుబుక్లలో భూమి ఇంకా వ్యవసాయ భూమిగానే కొనసాగుతోంది. దీంతో ప్రస్తుత యజమానులు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ పన్నులు క్రమంగా చెల్లిస్తున్నప్పటికీ, భూమి స్వభావ మార్పు నమోదు కాకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అభ్యంతరాలు వస్తున్నాయని బాధితులు తెలిపారు. తమ తప్పు లేకపోయినా పట్టాదారుల నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల స్థలాలుగా అమ్మిన భూములను వెంటనే వ్యవసాయ పాసుబుక్ల నుండి తొలగించి, రికార్డులను సరిచేయాలని మండల ప్రజలు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బాలానగర్ పోలీస్ సిబ్బందికి బీమా, పొదుపు మార్గాలపై అవగాహన సదస్సు
