
Emotional Trap: ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఓ విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటామని ఆశ చూపించి అమాయకుడైన 51 ఏళ్ల వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు యువతులు (అక్కాచెల్లెళ్లు) కలిసి చేసిన ఈ మోసపూరిత నాటకం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. పెళ్లి కాని పురుషులను ఎంచుకొని, వారు నమ్మకం పెంచుకునే విధంగా చేసి, ఆ నమ్మకాన్ని సొమ్ము చేసే పద్ధతిని ఈ ముఠా అలవాటుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
మొదట సోషల్ మీడియా ద్వారా పరిచయమైన 21, 19 ఏళ్ల అక్కాచెల్లెళ్లు తమ వయస్సును ఎరగా వేసి ఆ వ్యక్తితో మాట్లాడడం ప్రారంభించారు. రోజురోజుకు చాటింగ్ పెంచుతూ, తనపై నమ్మకం పెంచుకునే రీతిలో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అతనితో అనుబంధం ఏర్పరుచుకున్నారు. కొద్దికాలానికే పెళ్లి చేసుకుంటామని చెప్పి అతని మనసులో ఆశను రగిలించారు. పెళ్లి వంటి సున్నితమైన విషయంపై నమ్మకం ఏర్పడిన తర్వాతే ఈ ముఠా అసలు ప్లాన్‌ను అమలు చేసింది.
యువతులు సరదాగా గోవాకు ట్రిప్‌కు వెళ్లాలనుకుంటున్నామని, ఇందుకు రూ.5 లక్షలు అవసరమని చెప్పడంతో ఆ వ్యక్తి నమ్మకంతో ఆ మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించాడు. వారు చెప్పినట్లుగా నగదు ఇచ్చేందుకు అతడు ఒక పార్క్‌కు వెళ్లాడు. కానీ అక్కడ అతడికి మోసపూరితమైన అనుభవం ఎదురైంది. యువతులతో కలిసి పనిచేసే ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా అతడిపై దాడి చేసి నగదు బలవంతంగా లాక్కున్నారు. యువతులు కూడా ఈ ప్లాన్‌లో భాగమై ఉండటంతో అతడు పూర్తిగా మోసపోయిన విషయం అర్థమైంది. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ALSO READ: Health: ‘శనివారమే కాదు.. ఈ సమస్యలు ఉన్నవారు ఏ రోజు కూడా వంకాయ తినొద్దు’





