పశ్చిమాసియాలో యుద్థ పరిస్థితులు
ఎమిరేట్స్ విమానానికి అరుదైన పరిస్థితి
పశ్చిమాసియాలో యుద్థ పరిస్థితులతో ఎమిరేట్స్ విమానం అరుదైన పరిస్థితి ఎదుర్కొంది. ముంబై నుంచి మంగళవారం ఉదయం దుబాయికి బయలుదేరిన విమానం గగనతలంలో రెండుసార్లు వెనక్కి మళ్లి.. ఎట్టకేలకు ఎయిర్‌పోర్టులో దిగింది.
అసలు ఏం జరిగింది?
ఫ్లైట్ రాడార్ 24 డేటా మేరకు.. ఈకే501 విమానం యూఏఈ గగనతలం వెలుపల నుంచి వెనక్కి తిరిగింది. యూఏఈపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తోందన్న హెచ్చరికలతో ఆ విమానానికి క్లియరెన్స్ రాలేదు. దీంతో ఆ విమానం ముంబైకి మళ్లి కొద్ది సేసపటి తర్వాత దుబాయ్ వైపు తిరిగింది. తర్వాత మరోసారి ముంబైకి మళ్లగా, దుబాయ్ ఎయిర్ పోర్టు అధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో క్షేమంగా ఎయిర్‌పోర్టులో దిగింది.
12వేల విమానాలు రద్దు
అటు మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తల కారణంగా ఏకంగా 12వేల విమానాలు రద్దు అయ్యాయి. అటు దుబాయ్ సహా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నాయి. వీటికి తోడు గల్ఫ్ విమాన సంస్థలు కూడా కొన్ని విమానాలను ఇండియాకు నడుపుతున్నాయి.
