
Bihar New Voter List: రాజకీయ దుమారం చెలరేగినప్పటికీ భారత ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల ముసాయిదా జాబితాను పకడ్బందీగా రూపొందించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో కీలకమైన ముసాయిదా జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90,817 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితా ఇది విడుదల చేసింది. రాష్ట్రంలోని 38 జిల్లాల కలెక్టర్లు ముసాయిదా జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేశారు. ఓటర్లు తమ పేర్లను ఈసీ వెబ్ సైట్‌లో చూసుకోవచ్చుని వెల్లడించారు.
సెప్టెంబర్ 1 వరకు ఫిర్యాదుల స్వీకరణ
ముసాయిదా జాబితా విడుదల కావడంతో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేసుకోవాలని ఈసీ వెల్డించింది. సెప్టెంబర్ 1 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. తమ పేర్లు పొరపాటున జాబితాలో లేకపోతే, మళ్లీ లిస్టులోకి ఎక్కించాల్సిందిగా అధికారులను ఓటర్లు కోరవచ్చని తెలిపింది. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఈ జాబితాను రూపొందించినట్లు ఈసీ ప్రకటించింది.
ఈసీ ఎన్ని ఓట్లను తొలగించిందంటే?
గత కొద్ది రోజులుగా బీహార్ ఎన్నికల ముసాయిదా విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు రభస చేస్తున్నా, ఈసీ పట్టించుకోవడం లేదు. ఈ జాబితా రూపకల్పనకు సంబంధించిన కీలక విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉంది. రాష్ట్రంలో 52 లక్షల మంది ఓటర్లు సంబంధిత చిరునామాల్లో లేరని తెలిపింది. 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా, 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్టు వెల్లడించింది. మరో 7 లక్షల మంది రెండు చోట్ల ఓట్లు నమోదు చేసుకున్నట్టు తెలిపింది. వీటన్నింటిని సరిచేస్తూ కొత్త లిస్టును విడుదల చేసినట్లు ఈసీ వెల్లడించింది.
Read Also: అవన్నీ బాధ్యతారహిత వ్యాఖ్యలు, రాహుల్ పై ఈసీ తీవ్ర ఆగ్రహం!