Friday, March 13, 2026
Homeతెలంగాణతెలంగాణలో మూడు రోజులు కుండపోత..10 జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణలో మూడు రోజులు కుండపోత..10 జిల్లాలకు రెడ్ అలెర్ట్

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురువనున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు సముద్రమట్టానికి 7.6కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకు వాలి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో బుధవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. గంటలకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments